దేశాభివృద్ధికి విద్య కీలకం మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR,

విద్యార్థులు నిబద్ధతతో విద్యాభ్యాసం చేస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, దేశ, సమాజ అభివృద్ధికి విద్య కీలకం, ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  అన్నారు.

సిద్ధిపేట జిల్లా మిట్టపల్లి మరియు ఎల్లుపల్లి గ్రామాలలో ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలు మరియు కళాశాలలను  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  శనివారం సందర్శించారు.

పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులతో మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం సంక్షేమ రంగంలో తీసుకుంటున్న పలు అభివృద్ధి చర్యలను వివరించారు.

పాఠశాల వసతి సదుపాయాలు, భోజనశాల, తరగతి గదులు, ల్యాబ్‌లు, లైబ్రరీలను మంత్రి  పరిశీలించి, అవసరమైన చోట్ల మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు అధికారులకు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.