👉 మెరుగైన చికిత్సకు ₹ 5 లక్షల మంజూరు !
J.SURENDER KUMAR,
సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థి హిమేష్‌ను సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ శనివారం సాయంత్రం పరామర్శించారు. హిమేష్ ఆరోగ్య పరిస్థితిని ఆసుపత్రి వైద్యులనుంచి అడిగి తెలుసుకున్న మంత్రి, మెరుగైన చికిత్స అందించాలంటూ వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర వైద్య సేవల కోసం ప్రభుత్వ పక్షాన ₹ 5 లక్షలు మంజూరు చేశారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపు ఎస్సీ హాస్టల్ విద్యార్థి హిమేష్ గత రెండు రోజుల క్రితం పిడుగుపాటుతో తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన వైద్యం కోసం విద్యార్థిని హైదరాబాద్ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు.

యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ పవన్‌కుమార్ గోరుకంటి తో మంత్రి లక్ష్మణ్ కుమార్ , మాట్లాడుతూ విద్యార్థి చికిత్సలో ఎటువంటి లోపం ఉండకూడదని సూచించారు. విద్యార్థి గాయపడటం బాధాకరమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. హిమేష్ తల్లిదండ్రులకు మంత్రి లక్ష్మణ్ కుమార్ “ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, కలత చెందవద్దు” అని భరోసా ఇచ్చారు.
