సీఎం రేవంత్ రెడ్డి పై  వ్యక్తిగతంగా మాట్లాడితే ఊరుకోం !

👉 మహిళా బిల్లు పార్లమెంటులో పెడితే కాంగ్రెస్ పార్టీ మద్దతు !

👉  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి కేటీఆర్ వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హెచ్చరించారు.


ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడారు.


👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….

2014 నుండి 2023 వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిందని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం కావడానికి ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పనలో అధికారుల ప్రమేయం కంటే కేసీఆర్ తానే ఇంజనీర్ గా ముందుకు వెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టును కులేశ్వరం ప్రాజెక్టుగా మార్చారని మంత్రి ఆరోపించారు.


👉 కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఇందులో భాగంగా  సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 20 న మేడిగడ్డ సందర్శనకు వస్తున్న సందర్భంగా ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు తరలిరావాలని పిలుపునిచ్చారు.


👉 బీఆర్ఎస్  అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ ను కేటీఆర్ ను ఎక్కువ సార్లు విమర్శించిన వ్యక్తి మాజీమంత్రి జీవన్ రెడ్డి అని మంత్రి అన్నారు.


👉 కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎం గా మార్చారని పేరు పెట్టింది జీవన్ రెడ్డి అని మంత్రి అన్నారు. జీవన్ రెడ్డి పార్టీ మారే విషయంపై స్థానిక నాయకత్వం నుండి జాతీయ నాయకత్వం వారితో చర్చలు జరిపామని ఆయన పార్టీ మారతానని జీవన్ రెడ్డి వెళ్తున్నారని మంత్రి అన్నారు.


👉 రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన చూసి ఓర్వలేక కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అన్నారు. 2014 నుండి 2023 వరకు అధికారంలో ఉన్న కేటీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఏ నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నోరు జారలేదని మంత్రి గుర్తు చేశారు.


👉 అధికారంలో ఉన్న సమయంలో అక్రమంగా సంపాదించిన డబ్బుతో కేటీఆర్ కు అహంకారం ఎక్కువై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని విమర్శిస్తున్నారని మంత్రి అన్నారు.


👉 పదేళ్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని రాష్ట్ర కాంగ్రెస్  చెట్టు నీడగా ఉన్న ముఖ్యమంత్రి పై ఆరోపణలు చేస్తే సహించేది లేదని మంత్రి హెచ్చరించారు.


👉 జీవన్ రెడ్డి భుజంపై తుపాకీ పెట్టి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని బీఆర్ఎస్ పార్టీ శిఖండి రాజకీయాలు చేస్తుందని మంత్రి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ జగిత్యాలలో ఏర్పాటు చేసిన సభ బీఆర్ఎస్ బహిరంగ సభనా..? జీవన్ రెడ్డి చేరిక సభనా..? చెప్పాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు.


👉 కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విధానాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పోరాటం చేస్తున్నారని ఇందులో భాగంగా నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై రేవంత్ రెడ్డి  దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా మాట్లాడుతున్నారని మంత్రి అన్నారు.


👉 పార్లమెంటులో బిజెపి మహిళా బిల్లు ప్రవేశపెడితే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


👉 సోమవారం సాయంత్రం నిర్వహించే ముఖ్యమంత్రి సభకు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.