40 లక్షల మంది రైతు ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు !

👉 నస్తూర్‌పల్లి లో రైతు ఉత్సవాల్లో  సీఎం రేవంత్ రెడ్డి !

J SURENDER KUMAR,

రైతులకు వ్యవసాయ పెట్టుబడి సాయంగా ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  40 లక్షల రైతు ఖాతాల్లోకి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా నస్తూర్‌పల్లి గ్రామంలో నిర్వహించిన రైతు ఉత్సవాల్లో పాల్గొన్నారు.

👉 తొలుత గ్రామంలో ముఖ్యమంత్రి  రైతులతో కలిసి రైతు ఉత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభ వేదికగా కంప్యూటర్‌పై బటన్ నొక్కి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఈరోజు ₹ 2,200 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయగా, ఇప్పటివరకు రైతు భరోసా కింద ₹ 5,700 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు చెప్పారు. వచ్చే నెలలో మరో ₹ 3,300 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని తెలిపారు.

👉 ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  మాట్లాడుతూ…

, “ఈ దేశానికి వెన్నెముక రైతులే. రైతులను ఆదుకుని వారిని నిటారుగా నిలబెట్టే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. రైతు సంక్షేమమే మా విధానం” అని రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు.

👉 ₹ “2 లక్షల రూపాయల మేరకు రుణమాఫీ చేస్తామని మాటిచ్చి, అధికారం చేపట్టిన ఏడాదిలోపే 25.35 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశాం. గతసారి కేవలం 9 రోజుల్లోనే ₹9 వేల కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చాం. వ్యవసాయం దండగ కాదు పండుగ కావాలన్నదే మా సంకల్పం. రైతుల కళ్లల్లో ఆనందం చూడాలన్నదే మా లక్ష్యం. అందుకే సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటూ ముందుకు వెళుతున్నాం..” అని చెప్పారు.

👉 ఈ రైతు ఉత్సవాల్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి , పొన్నం ప్రభాకర్ , పొంగులేటి శ్రీనివాస రెడ్డి , ధనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , వివేక్ వెంకటస్వామి తో పాటు ప్రభుత్వ విప్‌లు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.