👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
అతి ప్రాచీన వేలాది సంవత్సరాల చరిత్ర గల కోటిలింగాల కోటిలింగాల క్షేత్రం, శ్రీ కోటేశ్వర స్వామి ఆలయం, నా నియోజకవర్గంలో ఉండడం, శ్రీ కోటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న సాంప్రదాయ పూజాది కార్యక్రమాలు, మహిమాత్మా గల స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని వేడుకున్నట్టు రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

.కోటిలింగాలలోని శ్రీ కోటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న శివపార్వతుల కళ్యాణా మహోత్సవానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ కు ఆలయ పూజారులు ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు.

కోటిలింగాలలోని శ్రీ కోటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి వివరించారు. 2027లో నిర్వహించి గోదావరి పుష్కరాలకు పెద్ద ఎత్తున నిధుల తో భక్తుల సౌకర్యానికి ఏర్పాట్లు చేయనున్నట్టు మంత్రి స్పష్టం చేశారు.
