చత్రపతి శివాజీ యువతకు ఆదర్శం !

👉 నియోజకవర్గంలోని సాగునీటి సమస్యలు పరిష్కరిస్తా!

👉 మంత్రి అడ్లూరిలక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

చత్రపతి శివాజీ వీర యోధుడని నేటితరం యువత చత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకొని అనుకున్నా లక్ష్యాలను సాధించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని మంత్రి అడ్లూరి శనివారం ప్రారంభించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి అడ్డూరి మాట్లాడుతూ….

చత్రపతి విగ్రహ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. చత్రపతి శివాజీ వీరోచిత పోరాటంతో మనం నేడు స్వేచ్ఛగా జీవిస్తున్నామని మంత్రి అడ్లూరి అన్నారు.

👉 ధర్మపురి నియోజకవర్గంలోనూ సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి కృషి చేస్తున్నట్టు మంత్రి వివరించారు. మేడారం రిజర్వాయర్ నుండి కొత్తపేట వరకు 11 గ్రామాలకు ఉపయోగపడే సాగునీటి పనులు త్వరలోనే పూర్తి చేస్తానని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

👉 ముంజంపల్లి మారేడుపల్లి గ్రామాలకు సాగునీటిని అందించే 11ఎల్ కాలువ పనులు సైతం పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు.

👉 పత్తిపాక రిజర్వాయర్, అక్కపల్లి ఎత్తిపోతల పథకంతో పాటు రోళ్ళ వాగు ప్రాజెక్టు పూర్తి చేసి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి సాగునీటిని అందించాలని ఇటీవల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కలిసి విన్నవించినట్లు మంత్రి తెలిపారు.

👉 కొత్తపేట గ్రామంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహేందర్ రెడ్డి, రాంబాబు, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.