👉 గోదావరిలో మురుగు నీరు కలవకుండా ప్రత్యేక చర్యలు..డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తాం !
J SURENDER KUMAR,
ధర్మపురి పట్టణంలో రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం మార్నింగ్ వాక్ చేశారు.
డ్రైనేజీ వ్యవస్థను ఆధునికరించి ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఇందుకు స్థానిక నాయకులు ప్రజలు సహకరించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు.
మంత్రి అడ్లూరి గోదావరి పుష్కర ఘాట్లతో పాటు పట్టణంలోని పలు వార్డులను సందర్శించి డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ వచ్చే గోదావరి పుష్కరాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని మంత్రి అన్నారు.

👉 ధర్మపురి పట్టణంలో ప్రజలతోపాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తామని మంత్రి తెలిపారు.
👉 పట్టణంలోని డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. డ్రైనేజీ నీరు గోదావరిలో కలుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు.
👉 పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్థానాలు ఆచరించడానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు.
