👉 బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి !
J.SURENDER KUMAR,
సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే…రేవంత్ రెడ్డికి ఆయన ఫ్యూచర్ తప్ప తెలంగాణ ఫ్యూచర్ అక్కర్లేదు అని జగిత్యాలలో బి ఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి మీడియా సమావేశం లో మాట్లాడారు.
👉 ప్రాణహిత నది వినియోగం లో ఆనాడు కాంగ్రెస్ అధికారం లో ఉన్నా…. మహా రాష్ట్రతో ఒప్పందం కుదర్చుకోలేక పోయారు…
👉 కేసీఆర్ లౌక్యం ప్రదర్శించి మెడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు…ప్రమాదవశాత్తు కుంగి పోయిన కాళేశ్వరం ప్రాజెక్టును మరమ్మత్తు చేయలేని అసమర్ధ ప్రభుత్వం….అసమర్థుడు ముఖ్యమంత్రి… సిగ్గుపడాలి…
👉 సీఎంతో మాట్లాడడానికి మధ్యవర్తి ఉండటం చుస్తే పరిస్థితి అర్థమవుతుంది….తెలంగాణ ఎండబెట్టి పోలవరానికి సీఎం రేవంత్ రెడ్డి వంత పాడుతున్నాడు…
👉 పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు 10 శాతం పనులు చేసి కాలువ నిర్మిస్తే వినియోగంలోకి వస్తది… కానీ తట్టుడు మట్టి ఎత్తి పోయలేదు..ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయక పొతే ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు..
👉 కాంగ్రెస్ పార్టీలో ఏ ముఖ్యమంత్రి ఎన్ని రోజులు ఉంటరో వారికే తెలియదు… 2029 లోనూ సీ ఏం గా ఉంటానడం హాస్యాస్పదం అసిఫాబాద్ పోయిన సీఎం రేవంత్ రెడ్డి తుమ్మడి హేట్టి వద్దకు పోలేదు అని ఆరోపించారు.
