J.SURENDER KUMAR,
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క మంచిర్యాల జిల్లా పర్యటన సందర్భంగా వస్తున్న నేపథ్యంలో శనివారం ధర్మపురి నియోజకవర్గం రాయపట్నం కూడలి వద్ద రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఘన స్వాగతం పలికారు.

ఉప ముఖ్యమంత్రి తో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ , పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తదితరులు ఉన్నారు.

జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ తో పాటు ధర్మపురి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
