👉 రెండు పార్టీలతో సింగరేణికి ₹ 9647 కోట్ల నష్టం !
👉 సింగరేణి పరిరక్షణ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం !
👉 కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటే ప్రజాస్వామ్యానికి ముప్పు !
👉 ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క!
J.SURENDER KUMAR,
సింగరేణి సంస్థకు నష్టం తీసుకువచ్చింది బీఆర్ఎస్, బీజేపీ పార్టీలని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. రెండు పార్టీల పరిపాలనలో సింగరేణి సంస్థలు వేల కోట్ల నష్టం జరిగిందని సింగరేణికి అన్యాయం చేసిన రెండు పార్టీలు ప్రజా ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు.
శనివారం మంచిర్యాల జిల్లాలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
మెదట దండేపల్లి మండలం గూడెం గుట్టలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులతో కలిసి ఉపముఖ్యమంత్రి పాల్గొన్నారు. ₹ 70 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. సింగరేణి సంస్థలో 335 మందికి కారుణ్య నియామక పత్రాలను మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియామక పత్రాలను మంత్రులతో కలిసి ఉపముఖ్యమంత్రి అందజేశారు.
👉 ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ….

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తాను చేపట్టిన పాదయాత్ర సందర్భంగా సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీ ప్రకారం సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తున్నామని భట్టి వివరించారు.
👉 ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా సింగరేణి కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే ₹ 1 కోటి 25 లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పించామని భట్టి వివరించారు.
👉 సింగరేణి సంస్థకు బీఆర్ఎస్, బీజేపీ పార్టీ చేసిన నష్టం సింగరేణి చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు చేయలేదని భట్టి ఆరోపించారు. తెలంగాణ ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి కేంద్ర క్యాబినెట్ లో మంత్రిగా ఉండి సింగరేణికి చెందాల్సిన రెండు బొగ్గు బ్లాక్ లను తన వద్ద పెట్టుకొని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేశారని భట్టి విక్రమార్క అన్నారు.
👉 బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో బొగ్గు బ్లాక్ ల వేలంలో పాల్గొనకుండా చేయడం ద్వారా సింగరేణి సంస్థకు ₹ 9647 కోట్ల నష్టం జరిగిందని భట్టి అన్నారు.
👉 రెండు పార్టీలతో నష్టం జరిగినప్పటికీ దొంగే దొంగ అన్నట్లు ప్రస్తుతం సింగరేణిపై రెండు పార్టీలు మాట్లాడుతున్నాయని బట్టి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ సింగరేణికి గోదావరికి అన్యాయం చేసిందని భట్టి ఆరోపించారు.
👉 వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న సింగరేణి సంస్థ రోజువారి పనుల్లో ప్రభుత్వ జోక్యం ఉండదని భట్టి తెలిపారు. సింగరేణిలో మెడికల్ బోర్డు కొనసాగుతుందని మారు పేర్లపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని భట్టి హామీ ఇచ్చారు.

👉 పదేళ్లపాటు అధికారంలో ఉన్న కేసీఆర్ చేసిన అప్పులు రాష్ట్రానికి గుదిబండగా మారాయని ఉప ముఖ్యమంత్రి అన్నారు. ప్రతి నెల సుమారుగా ₹ 7వేల కోట్ల రూపాయలు కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తున్నామని ఏడాదికి సుమారుగా ₹ 74 వేల కోట్లు వరకు చెల్లిస్తున్నామని భట్టి వివరించారు.
👉 పదేళ్లపాటు మంత్రిగా పని చేసిన హరీష్ రావు సింగరేణి పై ప్రజా ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని భట్టి మండిపడ్డారు.
👉 సింగరేణిలో 335 మందికి కారుణ్య నియామక పత్రాలను అందజేస్తున్నామని విషయం తెలిసి ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను తగ్గించడానికి హరీష్ రావు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని భట్టి వివరించారు.
👉 హరీష్ రావు ఆరోపణలపై ప్రజలకు వాస్తవాలను వివరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బట్టి అన్నారు.
👉 బీజేపీ అధికారంలో ఉంటే ప్రజాస్వామ్యానికి పెను ముప్పుగా భావించాలని భట్టి అన్నారు. మీనాక్షి నటరాజన్ పై తెలంగాణలోని ఏ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని భట్టి స్పష్టం చేశారు.
👉 కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటే రానున్న రోజుల్లో సర్పంచ్ నుండి మొదలుకొని పార్లమెంటు సభ్యుల వరకు వాళ్లకు నచ్చిన వ్యక్తులు గెలిచే విధంగా నామినేషన్ సమయంలో నిర్ణయాలు తీసుకొని వ్యతిరేక వ్యక్తుల నామినేషన్ తిరస్కరిస్తారని భట్టి అన్నారు. మీనాక్షి నటరాజన్ వ్యవహారం ప్రజాస్వామ్యవాదులు ఒక హెచ్చరికగా భావించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి అన్నారు.
