👉 కేసీఆర్ అవమానించినప్పుడు దళితుడిగా కొప్పులకు అండగా నిలిచాను !
👉 కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జీవన్ రెడ్డి వాట ఎంతో చెప్పాలి!
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
హరీష్ రావు దొర మెప్పు పొందడానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో దొరలు అవమానించినప్పుడు కొప్పుల ఈశ్వర్ కు సాటి దళితుడిగా అండగా నిలిచానని రాష్ర్ట సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
👉 కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనాల శాఖ అతిధి గృహంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అడ్లూరి మాట్లాడుతూ ..
దోచుకోవడం దాచుకోవడం బీఆర్ఎస్ పార్టీకి పెటెంట్ హక్కు అని, కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో జీవన్ రెడ్డికి వచ్చిన వడ్ల కమీషన్ ఎంతో చెప్పాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
👉 ఏడాది క్రితం రాష్ర్ట ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా తాను బాధ్యతలు తీసుకున్నానని మంత్రి అడ్లూరి అన్నారు. గత ప్రభుత్వంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పని చేశారని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకుల పాఠశాల కార్యదర్శిగా పని చేశారని ఏడాది కాలంగా ఎందుకు ఆయా శాఖలపై మాట్లాడలేదని మంత్రి అడ్లూరి ప్రశ్నించారు.
👉 సంక్షేమ శాఖలో ₹ 2 వేల కోట్ల అవినీతి జరిగిందని హరీష్ రావు ఆరోపిస్తే ఆశాఖ మంత్రిగా జవాబు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని మంత్రి అడ్లూరి అన్నారు. సంక్షేమ శాఖకు సంబంధించి విద్యార్ధులకు కావాల్సిన వస్తువుల కొనుగోలుకు ₹ 683 కోట్లతో టెండ్లర్లు పిలిచామని, ₹ 500 కోట్లతో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం టెండర్ల ఖారారు చేశామని మంత్రి అడ్లూరి తెలిపారు.
👉 మొత్తం ₹ 1183 కోట్లకు టెండర్లు పిలిస్తే మాజీ మంత్రి హరీష్ రావు ₹ 2 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తే ఆశాఖ మంత్రిగా జవాబు చెప్పానని మంత్రి అడ్లూరి అన్నారు. తాను జవాబు చెప్పితే దొరగారి మెప్పు కోసం కొప్పుల ఈశ్వర్ ఖాబ్దార్ అని మాట్లాడుతున్నారని మంత్రి అడ్లూరి అన్నారు.
👉 బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొప్పుల ఈశ్వర్ కు అవమానం జరిగితే తాను సాటి దళితుడిగా ఆరోజు ప్రతిపక్షంలో ఉండి అండగా నిలిచానని మంత్రి అన్నారు.
👉 2018 ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ ఏలా గెలిచాడో తెలంగాణ ప్రజలందరికి తెలుసని అన్నారు. కొప్పుల మంత్రిగా ఉన్న సమయంలో ఈవీఎంలు భద్రపరిచిన స్టాంగ్ రూం తాళం పోతే ఎక్కడ పోయిందని అడిగితే నాటి మంత్రి కొప్పుల ఈశ్వర్ సమాధానం చెప్పాలేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
👉 కొప్పులపై తాను 2009లో పోటీ చేస్తే కేవలం1165ఓట్ల తేడాతో ఓడిపోయానని, 2014లో 16వేల మోజార్టీతో ఓడిపోయానని, తెలంగాణ కోసం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పోటీ చేసిన సమయంలో రాష్ర్టంలో ఎవ్వరికి డిపాజిట్ రాలేదని తనకు మాత్రమే డిపాజిట్ వచ్చిందని మంత్రి గుర్తు చేశారు.
👉 ధర్మపురి ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన కొప్పుల ఈశ్వర్ నియోజకవర్గానికి ఏమీ చేయలేదని మంత్రి అన్నారు. ధర్మపురికి డిగ్రీ కళాశాల, రెవెన్యూ డివిజన్, ఆర్టీసీ బస్సు డిపో ఏమీ తీసుకురాకపోవడంతోనే 2023 ఎన్నికల్లో ఈశ్వర్ కు ప్రజలు బుద్ది చెప్పారని మంత్రి అన్నారు.
👉 2024 పార్లమెంట్ఎన్నికల్లో సైతం ధర్మపురి నియోజకవర్గ ఓటర్లు కొప్పులకు ఓట్లే వేయలేదని మంత్రి అడ్లూరి తెలిపారు. దోచుకోవడం దాచుకోవడం బీఆర్ఎస్ పార్టీకి పెటెంట్ హక్కు అని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గతంలో సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న కొప్పుల, గురుకుల కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ కుమార్ కలిసి దోచుకున్నారు కనుక ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రాష్ర్టంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తుందని మంత్రి పేర్కొన్నారు.
👉 పది సంవత్సరాలు నీ దగ్గర పిఏలు, పి ఎస్ లు గా పనిచేసిన వారి ఆస్తులు గతంలో ఎన్ని ? ప్రస్తుతం వారి ఆస్తులు ఎన్నో ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు తెలుసు. విచారణకు సిద్ధమా ? ఎవరి హాయంలో ఎవరు ఎంత దోచుకున్నారో తెలిసిపోతుంది మంత్రి అన్నారు.
👉 జీవన్ రెడ్డి వాటాఎంతో చెప్పాలి !
కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి వడ్ల కొనుగోలులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారని, జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో రాష్ర్ట ప్రభుత్వం నాలుగు సీజన్లలో వడ్లు కొనుగోలు చేసిందని, మరి అప్పుడు జీవన్ రెడ్డి కి ఎంత కమీషన్ వచ్చిందో చెప్పాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
