బహుజన ఆత్మగౌరవానికి సర్దార్ పాపన్న స్ఫూర్తి !

👉 తెలంగాణ తొలి బహుజన చక్రవర్తిగా సర్వాయి పాపన్న గౌడ్‌.!

👉  పాపన్న ఆశయాలే సామాజిక న్యాయానికి మార్గదర్శకం.!

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

తెలంగాణ గడ్డపై అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా నిర్వహించిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

👉 అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక !

సామాజిక అసమానతలు, అణచివేతకు వ్యతిరేకంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సాగించిన పోరాటం తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా బహుజన వర్గాలకు స్ఫూర్తిదాయకమని మంత్రి పేర్కొన్నారు. సామాన్య కుటుంబం నుంచి ఎదిగి ప్రజల కోసం పోరాడిన పాపన్న గౌడ్ చరిత్రలో గొప్ప బహుజన నాయకుడిగా నిలిచారని అన్నారు.

ఆత్మగౌరవం, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన సాగించిన పోరాటం భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి తెలిపారు.

👉 మహనీయుల చరిత్ర భావితరాలకు చేరాలి !

సామాజిక మార్పు కోసం పోరాడిన మహనీయుల చరిత్రను భావితరాలకు అందించడం, వారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రభుత్వ బాధ్యత అని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వంటి మహనీయుల స్ఫూర్తితో బహుజన, అణగారిన వర్గాల సంక్షేమం, సామాజిక న్యాయం కోసం ప్రభుత్వం మరింత కృషి చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు.

👉 పాపన్న స్ఫూర్తితో సామాజిక న్యాయం !

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించిన మంత్రి.. ఆత్మగౌరవం, సమానత్వం, సామాజిక న్యాయం కోసం పాపన్న చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని పిలుపునిచ్చారు. పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి తెలంగాణ సమాజంలో సామాజిక సమానత్వ సాధనకు నిరంతరం మార్గదర్శకంగా నిలుస్తుందని అన్నారు.