రాహుల్ గాంధీ ది ప్రాణ త్యాగాల కుటుంబం !


👉 ధర్మపురిలో ఘనంగా  రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.!


👉 కేక్ కట్ చేసిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR,

దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగాల కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం అని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి  పట్టణంలోని  నంది చౌరస్తా లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  పాల్గొని కేక్ కట్ చేశారు.


👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ….

దేశ సమగ్రత, ఐక్యత కోసం రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర నిర్వహించారని మంత్రి అడ్లూరి అన్నారు.

👉 దేశం కోసం రాహుల్ గాంధీ కుటుంబం ప్రాణత్యాగాలు చేశారని మంత్రి  గుర్తు చేశారు. దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ  ప్రధాన మంత్రి పదవి చేపట్టకుండా ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ను ప్రధాని మంత్రి చేశారని మంత్రి అన్నారు.

👉 ప్రధాన మంత్రి మోడీ పేదలకు అన్నం పెట్టే ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి  అన్నారు. డిల్లీ శివారులో రైతులు మద్దతు ధర కోసం ధర్నా చేస్తే రైతులపై జీప్ ఎక్కించిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని మంత్రి అన్నారు.

👉 ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా దేశ ఐక్యత కోసం రాహుల్ గాంధీ పని చేస్తున్నారని 2029లో రాహుల్ గాంధీని ప్రధాని మంత్రిగా చూడాలని ఇందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిలుముల లక్ష్మణ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్ , తిరుపతి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.