మా ప్రజా ప్రభుత్వంలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

మా ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్క పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేస్తామని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గోవిందుపల్లి గ్రామంలో మంత్రి పర్యటించారు.

ఈ సందర్భంగా గ్రామంలో ఎస్సీ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని మంత్రి దృష్టికి గ్రామస్తులు తీసుకువచ్చారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. గ్రామంలో రేవేళ్ల లావణ్య శ్రీధర్ దంపతులకు మంజూరు అయిన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ...

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పేద ప్రజల స్వంతింటి కల నెరవేర్చడానికి కృషి చేస్తుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

అనంతరం పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసిన మంత్రి అడ్లూరి రాహుల్ గాంధీ కి శుభాకాంక్షలు తెలిపారు.