అభివృద్ధి పనులకు  సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ !


👉 మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో!


J.SURENDER KUMAR,


మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క , ఇతర మంత్రులు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ₹ 47.08 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

👉 అభివృద్ధి పనుల వివరాలు:

👉 ₹ 10 కోట్లతో ఊరుకొండపేట శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయ అభివృద్ధి.


👉 ₹ 20 కోట్లతో పాత మిడ్జిల్ మండలంలోని 40 గ్రామ పంచాయతీల అభివృద్ధి. (40 గ్రామాలు మండలాల పునర్విభజన తర్వాత ప్రస్తుతం మిడ్జిల్ మండలంలో 24, ఊరుకొండ మండలంలో 16 గ్రామాలు ఉన్నాయి).


👉 ₹ 17.08 కోట్లతో మిడ్జిల్ మండలంలో చెక్ డ్యామ్‌ల నిర్మాణానికి శంకుస్థాపన

👉 ₹చెక్ డ్యామ్‌ల వివరాలు: భైరాంపల్లి గ్రామం సమీపంలో దుంధుబి వాగు, వడియాల్ గ్రామం సమీపంలోని చిన్న వాగు (దుంధుబి వాగు), వస్పుల గ్రామం సమీపంలోని వస్పుల కత్వా పునరుద్ధరణ.

👉 విగ్రహాల ఆవిష్కరణ !

మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ , స్థానిక సీనియర్ నాయకుడు ద్యాప గోపాల్ రెడ్డి (గుడియాన్ పల్లి)  విగ్రహాలను ఆవిష్కరించారు.

ముఖ్యమంత్రి తో పాటు ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణా రావు , వాకిటి శ్రీహరి, శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి తో పాటు స్థానిక ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.