అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాల్సిందే !

👉 బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి మా ప్రభుత్వ లక్ష్యం !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR,

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు అన్ని  రాజకీయ పార్టీలు కలిసికట్టుగా కృషి కృషి చేయాల్సిన అవసరం ఉందని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన గ్రామంలో ఏర్పాటు చేసిన నూతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని శనివారం  మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆవిష్కరించారు.

👉 ఈ సందర్భంగా  మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ….

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన మార్గం దేశానికి ఆదర్శమని అన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం, విద్య ద్వారా సాధికారత కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు.

👉 అంబేద్కర్ ఆశయాల సాధనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. విద్య, ఉపాధి రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు.


👉 ఇందులో భాగంగా పేదల కొరకు పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడానికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నామని మంత్రి తెలిపారు.


👉 అర్హులకు రేషన్ కార్డు ఇవ్వడంతో పాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు సన్న ధాన్యం పండించిన రైతులకు బోనస్ చెల్లిస్తున్నమని తెలిపారు.


👉 యువత అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకుని సమాజంలోని అసమానతులను దూరం చేయడానికి కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.