ఇందిరమ్మ రాజ్యంలోనే సొంతింటి కల సాకారం !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


పేదలు బడుగు బలహీన వర్గాల ప్రజల సొంత ఇంటి కల ఇందిరమ్మ ప్రభుత్వ పాలనలోనే సహకారం అవుతుందని
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ధర్మపురి మండలం కోసునూరుపల్లె లో ఎన్నం సుజాత–మల్లారెడ్డికి ప్రభుత్వం మంజూరు చేసిన  ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పాల్గొని, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.


👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, …

ప్రతి నిరుపేద కుటుంబానికి సొంత ఇంటి కలను సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనమట్ల దినేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ చినుముల లావణ్య, ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిలుముల లక్ష్మణ్, మండల ఉపాధ్యక్షుడు వేముల రాజేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మధుకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.