మాల సంఘం భవనంకు నిధులు మంత్రి లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాల సంఘ భవన నిర్మాణానికి  కేవలం నిధుల మంజూరి ప్రొసీడింగ్స్ ఇచ్చి మోసగించారని,   సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామ మాల సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  తమకు హామీ ప్రకారం మేరకు  మాల సంఘ భవన నిర్మాణానికి ₹ 4 లక్షల నిధులు మంజూరు చేయడంతో మాల సంఘం పెద్దలు, యువకులు హర్షం వ్యక్తం చేశారు.

👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ,….

మాల సంఘం అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, గ్రామాల్లో సామాజిక వర్గాల సంక్షేమం కోసం అవసరమైన సహకారం అందిస్తామని మాల సంఘ నాయకులు హామీ ఇచ్చారు.