J.SURENDER KUMAR,
నేను స్వామివారి దర్శనంకు ఆలయంలోకి రాగానే భాజా భజంత్రీలు, పూలదండలతో స్వాగతించడం మరోసారి జరిగితే మీ పై యాక్షన్ తీసుకుంటా అని ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ ను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హెచ్చరించారు.
👉 వివరాలు ఇలా ఉన్నాయి..

మంగళవారం జరిగిన 2027 లో జరగనున్న గోదావరి పుష్కరాల సమీక్ష సమావేశం లో మంత్రి లక్ష్మణ్ కుమార్ తోపాటు సీనియర్ ఐఏఎస్ అధికారి, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ , శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోవడానికి ఆలయంలోకి వచ్చారు. ఆలయ సాంప్రదాయ పద్ధతిలో మంగళ వాయిద్యాలతో ఆలయ అధికారులు మంత్రిని స్వాగతించారు.

ఆలయ ధ్వజస్తంభం కు నమస్కరించిన మంత్రి ఆలయ కార్య నిర్వహణ అధికారి శ్రీనివాస్ ను పిలిచారు.
ఇది నీకు మూడో సారి చెప్తున్నాం, భాజభజంత్రీలు, పూలదండలతో మరోసారి స్వాగతం పలికితే యాక్షన్ తీసుకుంటా అని మంత్రి అన్నారు.
నేను స్వామివారి దర్శనముకు వచ్చిన ప్రతిసారి ఈ స్వాగత పద్ధతి బాగోలేదు అనడంతో ఈవో ఓకే సార్, ప్రోటోకాల్ అంటూ వివరించారు.

ఆ దేవుడి ముందు అందరూ సమానమే నేనే చెప్తున్నా మరోసారి ఇలా జరగవద్దు అనడంతో ఈవో బాజా భజంత్రీలను ఆలయ ప్రాంగణం నుండి బయటికి పంపించారు.
