J.SURENDER KUMAR,
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, తనకు,
తన కుటుంబానికి మొత్తం ₹ 198 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. రాజకీయ నాయకుడిగా మారి, బీహార్‌లోని బంకిపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఆయన పోటీ చేస్తున్నారు.. ఆయన నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం, తన కుటుంబానికి మొత్తం ₹ 198 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు.
👉 ఎన్నికల అఫిడవిట్ మరియు ఆస్తుల వివరాలు!

మొత్తం ఆస్తులు: b₹198 కోట్లు (ఇందులో ₹ 111.78 కోట్ల చరాస్తులు, ₹ 86.29 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి).
👉 వ్యక్తిగత ఆస్తులు: ప్రశాంత్ కిషోర్ పేరు మీద దాదాపు ₹ 96 కోట్ల ఆస్తులు ఉన్నాయి.
👉 భార్య ఆస్తులు: ఆయన భార్య డా. సుశీతా త్యాగి పేరు మీద ₹ 101 కోట్ల ఆస్తులు ఉన్నాయి (ఆమె ప్రశాంత్ కిషోర్ కంటే ఎక్కువ ఆస్తిపరురాలు).
👉 ఆదాయ వనరులు: గతంలో ఎన్నికల వ్యూహకర్తగా పని చేసినప్పుడు సంపాదించిన ఆర్జన, పెట్టుబడుల ద్వారా ఈ సంపద సమకూరినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
ఎన్నికల వ్యూహకర్తగా పలు రాష్ట్రాల్లోని వివిధ పార్టీలకు (వైఎస్సార్‌సీపీ, టీఎంసీ, డీఎంకే, కాంగ్రెస్, బీజేపీ మొదలైనవి) విజయాలు అందించిన ప్రశాంత్ కిషోర్. ఆ తర్వాత ‘జన్ సూరాజ్’ అనే కొత్త పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
ఈనెల 30న బక్కిన్పూర్ ఎన్నికల పోలింగ్ జరగనున్నది ఆగస్టు 3న ఓట్ల కౌంటింగ్.
