J.SURENDER KUMAR,
బ్రిక్స్ (BRICS) దేశాల కార్మిక ఉపాధి శాఖల మంత్రుల ప్రతినిధి బృందానికి హైదరాబాద్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన విందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ విందు సందర్భంగా ముఖ్యమంత్రి దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, చైనా, రష్యా, ఇరాన్, ఇథియోపియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రెజిల్ దేశాల మంత్రులను మర్యాదపూర్వకంగా కలిశారు.
👉 హైదరాబాద్ నగరంలో జరుగుతున్న 12వ బ్రిక్స్ కార్మిక, ఉపాధి శాఖల మంత్రుల సదస్సులో పాల్గొనడానికి వచ్చిన అతిథులకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ విందును ఏర్పాటు చేసింది.

👉 విందులో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ , కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే , రాష్ట్ర మంత్రులు వివేక్ వెంకటస్వామి , జూపల్లి కృష్ణా రావు , వాకిటి శ్రీహరి హాజరయ్యారు. డీజీపీ సీవీ ఆనంద్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
