👉 బీజేపీ బీఆర్ఎస్ రెండో పార్టీలు ఒక్కటే !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
బిజెపి నాయకులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, దమ్ముంటే రాష్ట్ర ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్టు పై తీర్మానం చేసి సిబిఐ విచారణకు పంపిన అంశంపై చొరవ తీసుకొని కాలేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐతో విచారణ జరిపించాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. బంజారాల శీత్ల పండుగ సందర్భంగా మంగళవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం లంబాడి తండాలో మంత్రి పాల్గొన్నారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ…
ప్రజా ప్రభుత్వం పై బిజెపి నాయకులు చేస్తున్నారని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ కొరకు తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఇప్పటివరకు విచారణ ముందుకు సాగడం లేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
కాళేశ్వరంపై సీబీఐ విచారణ కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తేనే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదని భావిస్తామని లేదంటే రెండు పార్టీలు ఒకటేనని ప్రజలకు వివరిస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
