👉 ప్రారంభించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ధర్మపురి నియోజకవర్గం బుగ్గారం మండలం యశ్వంత్రావు పేట గ్రామంలో ఉపాధి హామీ నిధులు ₹ 12 లక్షల నిధులతో నిర్మించిన నూతన అంగన్వాడి భవనం ను మంగళవారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ …

.
అంగన్వాడి కార్యకర్తలు అంగన్ వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు, బాలింతలు, గర్భిణీలకు పౌష్టికాహారం సకాలంలో అందించాలి అని ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
అంగన్వాడి కేంద్రాల ద్వారా ప్రభుత్వం చిన్నారులకు పౌష్టిక ఆహారం అందించడంతో పాటు ప్రీ ప్రైమరీ విద్యను అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. బాలింతలు, గర్భిణీల విషయంలో సైతం ప్రభుత్వం ప్రత్యేక పోషక పదార్థాలు అందిస్తూ వారి ఆరోగ్య పరిస్థితులపై జాగ్రత్తలు తీసుకుంటున్నదని మంత్రి వివరించారు. అంగన్వాడి సేవలను ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని మంత్రి పేర్కొన్నారు.

ఇటీవల యశ్వంతరావు పేట గ్రామానికి చెందిన షేక్ సమిత్ తమ్ముడు షేక్ సమీర్ వివాహము జరిగింది. మంత్రి లక్ష్మణ్ కుమార్ సమీర్ దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్ ఉరుమట్ల లక్ష్మీ బుచ్చయ్య, మాజీ జెడ్పిటీసీ బాధినేని రాజేందర్, బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సాగౌడ్ తదితరులు మంత్రి వెంట ఉన్నారు పాల్గొన్నారు.
