J.SURENDER KUMAR,
కరీంనగర్ రేంజ్ ఏసీబీ డీఎస్పీగా 1998 బ్యాచ్ కు చెందిన జి మహేందర్ రెడ్డి శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ డిఎస్పీగా విధులలో కొనసాగిన విజయ్ కుమార్ ను హైదరాబాద్ డీజీపీ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వులలో పేర్కొన్నారు.
డీఎస్పీ మహేందర్ రెడ్డి ఫోన్ నెంబర్ 9154388954 కాగా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064.
ఇది ఇలా ఉండగా…
గత నెలలో ఏసీబీ అధికారులు జగిత్యాల జిల్లా కొడిమ్యాల అటవీశాఖ రేంజ్ అధికారి కార్యాలయంపై మెరుపు దాడి చేసి నగదు తో పాటు రేంజర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని రిమాండ్ కు తరలించిన విషయం తెలిసింది.. ఈ సంఘటన నేపథ్యంలో కొందరు బాధితులు ప్రభుత్వానికి దాడి తీరుపై ఫిర్యాదులు చేసినట్టు సమాచారం.
