పాఠశాల ప్రారంభించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


ధర్మపురి నియోజకవర్గ మండల కేంద్రంలో నూతన శ్రీ గ్లోబల్ ప్రైవేట్ పాఠశాలను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. పాఠశాల ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రిబ్బన్ కట్ చేసి విద్యాసంస్థను ప్రారంభించారు.


👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,..


నాణ్యమైన విద్య విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది అని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆధునిక సౌకర్యాలతో కూడిన విద్య అందుబాటులోకి రావడం శుభపరిణామమని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలను అలవర్చుకోవాలని సూచించారు.


పాఠశాల యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి, ఈ విద్యాసంస్థ ద్వారా మండల విద్యార్థులకు ఉత్తమ విద్య అందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.