👉 ప్రక్రియ ను పరిశీలించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.!
J . SURENDER KUMAR,
భారత ఎన్నికల సంఘం ఓటర్ జాబితాలో సవరణ కోసం తీసుకువచ్చిన ‘సర్ ‘లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం ధర్మపురి మున్సిపల్ పరిధిలోని ఐదవ వార్డులో ‘సర్ ‘ప్రక్రియను మంత్రి పరిశీలించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ….
భారత ఎన్నికల సంఘం ఓటరు జాబితాలో సవరణ కోసం తీసుకువచ్చిన ప్రక్రియలో ప్రతి ఒక్కరు భాగస్వాములై ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఓటు హక్కును పొందాలని అన్నారు.
👉 భారత రాజ్యాంగంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కును అందించారని మంత్రి అడ్లూరి అన్నారు. ఓటు హక్కు ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం భారత రాజ్యాంగం కల్పించిందని అన్నారు.

👉 రాష్ట్రంలో ఓటరు నమోదు కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని అన్నారు. ఓటరు నమోదు కార్యక్రమం ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి తాను క్షేత్రస్థాయిలో పర్యటించినట్లు మంత్రి తెలిపారు.
👉 ఓటర్లు ప్రతి ఒక్కరు అధికారులకు పూర్తిస్థాయి సమాచారం ఇవ్వాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఓటరు నమోదులో భాగస్వాములు అవుతున్న అధికారులను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు.
👉 ఓటరు నమోదుకు కావలసిన వివరాలను అందించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ప్రతి ఒక్కరు పూర్తిస్థాయి సమాచారాన్ని అందించి ‘సర్’ లో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. మంత్రి వెంట ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మితో పాటు అధికారులు మున్సిపల్ కౌన్సిలర్లు నాయకులు ఉన్నారు.
