రైతుల సంక్షేమమే మా ప్రజా ప్రభుత్వ పాలన లక్ష్యం !

👉 రైతులందరికీ  భరోసా నిధులు జమ !

J.SURENDER KUMAR,

గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనులు శూన్యం రైతుల సంక్షేమ మా ప్రజా ప్రభుత్వ అని  లక్షమని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ  సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శనివారం  ధర్మపురి లో మంత్రి క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…..

ధర్మపురి నియోజకవర్గంలో 90,761 రైతులకు ₹ 87.21 కోట్ల నిధులు రైతు భరోసా ఖాతాలలో జమ చేయడం జరిగిందని అన్నారు. జగిత్యాల జిల్లాలో మొత్తం 2, 29,213 రైతులకు గాను ₹ 243.40 కోట్లు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని మంత్రి లక్ష్మణ్ కుమార్ వివరించారు.

👉 రాష్ట్రంలోని 32 జిల్లాలోని 70,40,286 రైతుల గాను ₹ 875. 96 కోట్లు రైతులకు ఖాతాలో జమ చేయడం జరిగిందని అన్నారు.

👉 బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు.  గోదావరి నది తీరాన ఉన్న ధర్మపురి పట్టణానికి తాగునీటి సమస్యను తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరించినట్లు మంత్రి తెలిపారు.

👉 నియోజకవర్గంలో ఎలాంటి అనుమతి లేకుండానే రోళ్ళ వాగు ప్రాజెక్టు నిర్మాణం పేరుతో కమిషన్ లు దండుకున్నారని, అక్కపల్లి ఎత్తిపోతల పథకాన్ని ఏనాడు పట్టించుకోలేదని, పట్టణంలో ఏర్పాటు చేసిన మాతాశిశు సంక్షేమాన్ని భవన నిర్మాణం కాంట్రాక్టర్ కి కనీసం బిల్లులు చెల్లించలేదని మంత్రి ఆరోపించారు.

👉 విద్యార్థుల సౌలభ్యం కోసం ధర్మపురిలో డిగ్రీ కళాశాల మంజూరు చేయించడంతో పాటు  ₹10కోట్ల సీఎస్ఆర్ నిధులతో భవన నిర్మాణం చేయడానికి చర్యలు తీసున్నామని మంత్రి అడ్లూరి అన్నారు.

👉 ధర్మపురి  అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగిందని పవిత్ర గోదావరినది  పుణ్య స్నానాల కోసం వచ్చే భక్తుల కోరకు గోదావరిలో మురుగు నీరు కలవకుండా సీవరేజ్ ప్లాంట్ నిర్మాణం చేస్తున్నామని,  ధర్మపురి పట్టణంలో కుల సంఘాల భవనాలు నిర్మించడానికి నిధులు మంజూరు చేశామని మంత్రి తెలిపారు.

👉 నియోజకవర్గంలోని 149 గ్రామాల్లో అంగన్ వాడీ భవనాల నిర్మాణం, మహిళా సంఘాలకు వివో భవనాలు నిర్మాణం చేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలో అవసరమైన చోట అదనపు తరగతి గదులు నిర్మాణం చేస్తూ ముందుకు సాగుతుందని మంత్రి తెలిపారు.

👉 నియోజకవర్గంలో వందలాది కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్న ప్రతిపక్షాల నాయకులు కొందరు సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి అన్నారు.

👉 నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేస్తామని  నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నామని మంత్రి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.