సాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలి!

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !


J SURENDER KUMAR,

వర్షాభావ నేపథ్యంలో ప్రస్తుతం రైతాంగానికి  సాగునీటి సమస్యలు తలెత్తకుండా నీటి వనరులను కెనాల్ సాగునీటి కాలువలు  మరమ్మతులు పూడికలు తీసి పంట పొలాలకు నీరు అందించాల్సిన బాధ్యత ఇరిగేషన్ శాఖ అధికారులదే అని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ధర్మపురి మండలంలోని నక్కలపేట్, దోనూర్, తీగలధర్మారం , దొంతపూర్ పరిసర గ్రామాల్లో శనివారం మంత్రి లక్ష్మణ్ కుమార్, రైతులు, ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి పర్యటించారు.

ఆయా గ్రామాల్లో సాగునీటి పరిస్థితులను పరిశీలించారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సాగునీరు సకాలంలో అందేలా కెనాల్లను క్షుణ్ణంగా పరిశీలించిన మంత్రి, అవసరమైన మరమ్మతులు చేపట్టి నీటి సరఫరాను మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.

👉 గంగమాత విగ్రహ ప్రతిష్టా కార్యక్రమంలో….

దొంతాపూర్ గ్రామంలోని గోదావరి ఒడ్డున నిర్వహించిన గంగమాత విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో  మంత్రి  లక్ష్మణ్ కుమార్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగమాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి ఆశీర్వాదాలు పొందారు. గోదావరి నది తెలంగాణ ప్రజల జీవనాడి అని, గంగమాత అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. గ్రామాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు సామాజిక ఐక్యతను పెంపొందించడంతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేస్తాయని మంత్రి  పేర్కొన్నారు.

తీగలధర్మారం గ్రామంలో లబ్ధిదారురాలు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి పాల్గొని లబ్ధిదారుల. కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.


ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి నాణ్యమైన గృహాలు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు, అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

👉 ప్లాస్టిక్ తో పర్యావరణానికి పెను ముప్పు !


ప్లాస్టిక్ తో పర్యావరణానికి పెను ముప్పని మంత్రి  లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన న్యాయవాది భూంరెడ్డి ధర్మపురి క్షేత్రంలో వివిధ అవసరాల నిమిత్తం క్లాత్ బ్యాగ్ అందించడానికి ముందుకు వచ్చారు.

శనివారం ఉదయం ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో క్లాత్ బ్యాగులను పర్యావరణ పరిరక్షణ క్యాప్ లను ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి ఆవిష్కరించారు.

ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురిని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి ఎందుకు అధికారుల సైతం ప్రత్యేక చొరవ తీసుకొని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.