తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన ప్రజాకవి అందెశ్రీ !
👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J .SURENDER KUMAR,
“జయ జయహే తెలంగాణ” గీతంతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి, తన కలాన్ని ఉద్యమ జెండాగా మలిచి తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన ప్రజాకవి అందెశ్రీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు.
👉 తెలంగాణ నేల ఆత్మను, ప్రజల ఆకాంక్షలను, ఉద్యమ స్పూర్తిని అక్షరాల్లో ఆవిష్కరించిన అరుదైన కవి అందెశ్రీ అని ముఖ్యమంత్రి కొనియాడారు. ఆయన కలం నుంచి జాలువారిన ప్రతి పదం తెలంగాణ ఉద్యమ చరిత్రలో చెరగని ముద్రగా నిలిచిందని, ప్రతి గేయం ప్రజల హృదయాల్లో ఆత్మగౌరవ జ్యోతిని వెలిగించిందని పేర్కొన్నారు.
👉 అందెశ్రీ సాహిత్యం కేవలం కవిత్వం మాత్రమే కాదని, అది తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా, స్వాభిమానానికి స్వరంగా, భావితరాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచిందని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ పట్ల ఆయనకున్న అచంచలమైన అంకితభావం, ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత, సమాజానికి ఆయన అందించిన సాహిత్య సంపద చిరకాలం మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
👉 తెలంగాణ చరిత్ర ఉన్నంతకాలం ప్రజాకవి అందెశ్రీ పేరు, ఆయన సాహిత్యం, ఆయన ప్రబోధించిన ఆత్మగౌరవ సందేశం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి, తరతరాలను చైతన్యపరుస్తూనే ఉంటాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

👉 అందెశ్రీ స్మృతివనానికి భూమి పూజ !
రాష్ట్ర గేయ రచయిత అందెశ్రీ జయంతి సందర్భంగా
అందెశ్రీ స్మృతివనానికి సీఎం నేడు భూమి చేయనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ₹ 3.95 కోట్లు మంజూరు చేసింది. అంత్యక్రియలు నిర్వహించిన ప్రదేశం లోనే విగ్రహంతోపాటు స్మృతివనం ఏర్పాటు చేయనున్నారు.
