సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ కీలక నిర్ణయం !

👉 ధర్మపురి డిగ్రీ కళాశాలకు 29 మంది టీచింగ్ టీచింగ్ సిబ్బంది నియామకానికి గ్రీన్ సిగ్నల్ !

👉 సీఎం  రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన  క్యాబినెట్ సమావేశంలో ధర్మపురి నియోజకవర్గానికి చెందిన కీలక అంశానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ధర్మపురికి మంజూరైన డిగ్రీ కళాశాలకు 29 మంది అధ్యాపక & సిబ్బంది పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ధర్మపురి నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురిలో మూతబడిన శ్రీ లక్ష్మీ నరసింహ  సంస్కృత ఆంధ్ర తెలుగు కళాశాల (నైట్ కళాశాల) ను ప్రారంభించడంతోపాటు  నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపట్టారు.

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ధర్మపురికి డిగ్రీ కళాశాలను మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకొని ఏర్పాటు చేశారు. డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి హిందుస్థాన్ ఏరోనాటికల్ సంస్థ సీఎస్ ఆర్ నిధులు ₹ 10కోట్ల నిధులు ఇవ్వడానికి ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు భవన నిర్మాణ పనులు మొదలు పెట్టారు

డిగ్రీ కళాశాల భవన నమూనా చిత్రం.

తాజాగా ధర్మపురి డిగ్రీ కళాశాల సిబ్బంది నియామకానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక చోరవ తీసుకున్నారు. శుక్రవారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ధర్మపురి డిగ్రీ కళాశాలకు 29 పోస్టుల భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ధర్మపురి డిగ్రీ కళాశాలకు 29 పోస్టుల భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలిపినందుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ధర్మపురి నియోజకవర్గానికి డిగ్రీ కళాశాల తీసుకురావడంతో పాటు, దానికి అవసరమైన నిధులు, తాజాగా పోస్టుల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయడంలో  మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విశేషమైన చొరవ చూపి ప్రత్యేక కృషి చేశారు.

👉 మంత్రి అడ్లూరి కి అభినందనలు కృతజ్ఞతలు !

ధర్మపురి నియోజకవర్గ ప్రాంత విద్యా వికాసానికి ఎంతో తోడ్పడే ఈ నిర్ణయం పట్ల స్థానిక ప్రజలు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తు మంత్రి లక్ష్మణ్ కుమార్ కు అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపిన  ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి కి, నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు. తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.