విద్యార్థుల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించండి !


👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, పరిశుభ్రత, నాణ్యమైన విద్యపై ప్రత్యేక దృష్టిసారించాలని  రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. హైదరాబాదులోడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం లో బుధవారం మంత్రికి లక్ష్మణ్ కుమార్  సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

వైరల్ జ్వరాలు, డెంగీ, మలే రియా, నీటి సంబంధిత వ్యాధుల ముప్పు పొంచి ఉన్నందున. ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో ముందస్తు ఆరోగ్య ప్రణాళికలు చేపట్టాలని ఎస్సీ, ఎస్టీ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు, విద్యార్థుల సంక్షేమం, వర్షాకాలంలో తీసుకో వాల్సిన జాగ్రత్తలపై ఆ శాఖ కార్యదర్శి విజయేంద్ర బోయి, డైరెక్టర్ సంతోష్, కార్యదర్శి శారద, ఇతర ఉన్న తాధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు.

👉 సమీక్ష సమావేశంలో మంత్రి అధికారులకు పలు అంశాలను సూచించారు


గురుకుల ప్రవేశాల ప్రక్రియ పారదర్శకత, పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు, వసతి, బోధన సిబ్బంది సంఖ్య, ఏర్పాటు చేయాలన్నారు.
విద్యార్థులకు భోజన సామర్థ్యాన్ని పెంచాలి. బోధన కొరత ఉన్నచోట జిల్లా కలెక్టర్ల అనుమతితో తాత్కాలిక ప్రాతిపదికను నియామకాలు చేపట్టాలని సూచనలు చేశారు.  సెంటర్ ఆఫ్ ఎక్లెన్స్లను దశలవారీగా విస్త రించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు
.


👉 ఎస్సీ ఎస్టీ పేద విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వండి !


మిర్యాలగూడ, సూర్యాపేట, హనుమకోండ జిల్లాల పరిధిలోని ఎస్సీ ఎస్టీ పేద విద్యార్థులకు గురుకుల (రెసిడెన్షియల్) పాఠశాలల్లో అడ్మిషన్లు కల్పించాలని మాజీ ఎమ్మెల్యే  జూలకంటి రంగారెడ్డి, ఎస్ ఐ ఎఫ్ రాష్ట్ర నాయకుడు డి కిరణ్ బుధవారం మంత్రిని  సచివాలయంలో కలిసి వినతిపత్రం ఇచ్చారు.


👉 పదోన్నతులు కల్పించండి !

వసతి గృహ సంక్షేమ అధికా రులు గ్రేడ్-1 నుంచి సహాయ సాం ఘిక సంక్షేమ అధికారి (ఏఎస్ఈ బ్ల్యూవో) పోస్టులకు వెంటనే పదోన్నతులు కల్పించాలని తెలం గాణ జేఏసీ చైర్మన్, టీఎనీవోస్ కేం ద్ర సంఘం అధ్యక్షుడు మారం జగ దీశ్వర్ నేతృత్వంలోని ప్రతినిధి బృం దం సచివాలయంలో  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ను కలిసి వినతిపత్రం ఇచ్చారు.

మంత్రి సానుకూలంగా స్పం దిస్తూ, తెలంగాణ రాష్ట్ర సబార్డినేట్ సర్వీస్ రూల్స్లోని రూల్ 16 (జి) ప్రకారం అర్హులైన గ్రేడ్-1 వసతి గృ హ సంక్షేమ అధికారులకు త్వరలోనే పదోన్నతులు కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.