అంబేద్కర్ చిత్రంపై జాతీయ చర్చకు తెరలేపిన మంత్రి అడ్లూరి !


👉 రాజ్యాంగ విలువలకు ప్రతీకగా అంబేద్కర్ కు
కరెన్సీపై స్థానం కల్పించాలి !


👉 కేంద్రానికి అధికారిక ప్రతిపాదన పంపేలా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోతాం !


👉 సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


భారతీయ కరెన్సీ నోట్లపై భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రాన్ని ముద్రించాలనే డిమాండ్ మరోసారి జాతీయ రాజకీయ చర్చకు దారి తీసే సూచనలు కనిపిస్తున్నాయి. కరెన్సీపై ఎవరి చిత్రాలు ఉండాలనే అంశం కేవలం ఆర్థిక నిర్ణయం మాత్రమే కాదు  అది దేశ చరిత్ర, రాజ్యాంగ విలువలు, జాతీయ గుర్తింపు, రాజకీయ సంకేతాలతో ముడిపడి ఉంటుంది. ఈ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం తరఫున అధికారికంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రకటించడం ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుంది.


👉 న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో శుక్రవారం మంత్రి  విలేకరుల సమావేశంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడారు…..

కరెన్సీ నోట్లపై భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రాన్ని ముద్రించాలనే  ప్రతిపాదనను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రివర్గం దృష్టికి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వానికి అధికారిక విజ్ఞప్తి పంపేలా కృషి చేస్తానని మంత్రి తెలిపారు.


👉 డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కేవలం రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదని, ప్రపంచ స్థాయి ఆర్థికవేత్తగా కూడా భారత ద్రవ్య విధానంపై చెరగని ముద్ర వేశారని మంత్రి పేర్కొన్నారు. ఆయన రచించిన “The Problem of the Rupee: Its Origin and Its Solution” భారత ఆర్థిక విధాన చరిత్రలో మైలురాయిగా నిలిచిందని, రిజర్వ్ బ్యాంకు ఏర్పాటుకు ముందు జరిగిన ద్రవ్య విధాన చర్చల్లో ఆయన ఆలోచనలు విశేష ప్రభావం చూపాయని వివరించారు.


👉 రాజ్యాంగం కల్పించిన సమాన అవకాశాల వల్లే నాతోటి దళితుడు మంత్రి అయ్యే అవకాశం వచ్చింది. బడుగు, బలహీన వర్గాల సాధికారత కోసం తన జీవితాన్నంతా అంకితం చేసిన మహనీయుడికి దేశ అత్యున్నత గౌరవాల్లో భాగంగా కరెన్సీపై స్థానం కల్పించాలి” అని మంత్రి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.


👉 దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రతీకగా నిలిచే కరెన్సీ నోట్లపై అంబేద్కర్ చిత్రాన్ని ముద్రించడం ద్వారా రాజ్యాంగ విలువలు, సామాజిక న్యాయం, సమానత్వం పట్ల భారతదేశ నిబద్ధత ప్రపంచానికి మరింత స్పష్టంగా చాటినట్లవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మహాత్మా గాంధీకి దేశం ఇచ్చిన గౌరవంతో పాటు రాజ్యాంగ శిల్పి అంబేద్కర్‌కు కూడా తగిన జాతీయ గుర్తింపు లభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.


👉 కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జరిపోతుల పరుశురాం నాయకత్వంలో జంతర్‌మంతర్ వద్ద గత కొన్నేళ్లుగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమం కొనసాగుతోందని మంత్రి కొనియాడారు. అనంతరం జంతర్‌మంతర్‌లో కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి (CAPSS) నిర్వహిస్తున్న ధర్నాకు మంత్రి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన “కోలాటంతో ఢిల్లీపై కొట్లాట” సాంస్కృతిక కార్యక్రమం ఉద్యమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


👉 ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశీం, CAPSS జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జరిపోతుల పరుశురాం తదితరులు పాల్గొన్నా
రు.