విజ్ఞప్తి చేయడానికి ఢిల్లీకి వచ్చాం మంత్రి అడ్లూరి!

J.SURENDER KUMAR,

మహాత్మా గాంధీ లాగే, కరెన్సీ నోట్లపై డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్  ఫోటోను ముద్రించాలని మేము కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడానికి వచ్చాము. అని  రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,   ఢిల్లీలో ANI, PTI కి ఇచ్చిన  ఇంటర్వ్యూలో అన్నారు.

తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా, దేశమంతటి తరఫున ఆదరణీయ ప్రధానికి మా విజ్ఞప్తి ఏంటంటే—రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ అందించిన రాజ్యాంగం ఆధారంగానే నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయి అన్నారు.


మహాత్మా గాంధీ  ఫోటోను కరెన్సీ నోట్లపై ముద్రించినట్లే, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్  ఫోటోను కూడా ప్రింట్ చేయాలని కోరుతున్నాము. వర్షం కురుస్తున్న నేపథ్యంలో  మీడియా ద్వారా గౌరవ ప్రధాని కి ఈ విజ్ఞప్తిని తక్షణమే పరిశీలించి ముందుకు తీసుకెళ్లాలని విన్నవిస్తున్నాము మంత్రి అన్నారు.