హరీష్ రావు నన్ను జెడ్పి చైర్మన్ ఎలా చేస్తాడు ?

👉 కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అని హరీష్ రావు మంత్రి అయ్యాడు!

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,


2004 లో మా కాంగ్రెస్ పార్టీతో టిఆర్ఎస్ అలయన్స్ లో (పొత్తు)  హరీష్ రావు ఏ పదవీ లేకుండా మంత్రి అయిన  వ్యక్తి  హరీష్ రావు,  కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అని ఈ రాష్ట్రంలో ఏ పదవీ లేకుండా రాష్ట్రంలో కేబినెట్ మంత్రి అయిన ఆయన. ​నా మీద మాట్లాడుతూ, నన్ను జిల్లా పరిషత్ ఛైర్మన్‌ని చేసిన అని అంటున్నాడు, మరి హరీష్ రావు నన్ను జెడ్పి చైర్మన్ ఎలా చేస్తాడు ? చెప్పాలి అని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు.

👉 హైదరాబాద్ సిఎల్పీ కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…


తెరాస నాయకుడు హరీష్ రావు, నన్ను జెడ్పీ ఛైర్మన్‌ని నేనే చేశాను అని ఒక కామెంట్ చేస్తున్నాడు,  ఆయనది ఏ పార్టీ ? మరి BRS పార్టీ వ్యక్తి,  ఆయన  నన్ను జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఎట్లా చేస్తాడు మీరే చెప్పండి అంటూ మీడియా ప్రతినిధులను మంత్రి లక్ష్మణ్ కుమార్ కోరారు.

👉 కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ సభ్యులందరూ కలిసి ఎన్నుకుంటేనే జిల్లా పరిషత్ ఛైర్మన్ అవుతారు. కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ B-ఫారమ్ ఇస్తేనే జిల్లా పరిషత్ ఛైర్మన్ అవుతారు. ​ఆయన BRS పార్టీ, TRS పార్టీ. నాడు రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని మంత్రి గుర్తు చేశారు.

👉 నేను ఒకటే పార్టీని నమ్ముకున్న వ్యక్తిని, ఒకటే జెండాను నమ్ముకున్న వ్యక్తిని. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్నిసార్లు నష్టపోయినా, ఎన్నిసార్లు ఓడిపోయినా, ఒక దళిత వర్గం నుంచి వచ్చి సాధారణ కార్యకర్తగా ఈ రోజు ఒకటే జెండా, ఒకటే పార్టీని నమ్ముకొని ఇక్కడికి వచ్చినా. నన్ను  హరీష్ రావు ఏ విధంగా జిల్లా పరిషత్  ఛైర్మన్‌ని చేశాడో చెప్పమనండి ఆయన దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే తీసుకొచ్చి చూపించమనండి అని మంత్రి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు​..

👉 సోనియా గాంధీ పుణ్యమా అని, కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అని హరీష్ రావు మంత్రి అయ్యావు అంటాం,. అది యదార్థం కాదా ? హరీష్ రావు మీడియా ముందు  నన్ను జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఏ విధంగా చేశాడో చెప్పమనండి అంటూ మంత్రి లక్ష్మణ్ కుమార్  సవాల్ చేశారు.