ఇళ్ల స్థలాల కోసం ఐ జే యు ఆధ్వర్యంలో మంత్రికి వినతి పత్రం !

👉 సానుకూలంగా స్పందించిన మంత్రి పొంగులేటి.!


J.SURENDER KUMAR,

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ జిల్లా వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి వినతి పత్రం సమర్పించారు.

వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం జగిత్యాలకు వచ్చిన మంత్రిని కలిసిన జర్నలిస్టు నాయకులు ఈ మేరకు మంత్రికి వినతిపత్రం అందజేసారు. సానుకూలంగా స్పందించిన మంత్రి పొంగులేటి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై నివేదిక తయారుచేసి వెంటనే తనకు పంపాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ను ఆదేశించారు.
అంతకుముందు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా జర్నలిస్టుల కు నివేశ న స్థలాలు ఇవ్వాలని మంత్రి పొంగిలేటికి వినతిపత్రం అందజేశారు. శాసనమండలి సభ్యుడు ఎల్ రమణ ఎన్నో ఏళ్లుగా పెండింగులో ఉన్న జగిత్యాల జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను వెంటనే పరిష్కరించాలని మంత్రిని కోరారు.


ఈ సందర్భంగా టీయూ డబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చీటీ శ్రీనివాసరావు బెజ్జంకి సంపూర్ణ చారి లు మాట్లాడుతూ


ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభంగా భావించే జర్నలిస్టులు సమాజంలో ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. నిరంతరం ప్రజా సేవలో భాగస్వాములవుతున్న జర్నలిస్టుల సంక్షేమం పట్ల ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు.


గత 30 సంవత్సరాలుగా జగిత్యాల పట్టణంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇప్పటివరకు ప్రభుత్వపరంగా ఇళ్ల స్థలాలు మంజూరు కాలేదని గతంలో ఇళ్ల స్థలాల కోసం తాము ఉద్యమాలు కూడా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ ను వెంటనే పరిష్కరించాలని మంత్రిని కోరగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సానుకూలంగా స్పందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాగుల గోపాల చారి, యూనియన్ నాయకులు గడ్డల హరికృష్ణ, చంద్రశేఖర్, సీనియర్ జర్నలిస్టులు మదన్ మోహన్, అంజయ్య, ఆనంద్ తదితరులున్నారు.