J.SURENDER KUMAR,
సాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ శ్ శివ ప్రతాప్ శుక్లా లోక్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ఎట్ హోమ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ ఎట్ హోమ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి తో పాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ , ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీ తో పాటు ఉన్నతాధికారులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు.

👉 మాజీ ప్రధానమంత్రుల విగ్రహావిష్కరణ !

హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథారిటీ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన మాజీ ప్రధానమంత్రులు స్వర్గీయ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహాలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ , ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి , వివేక్ వెంకటస్వామి ఎంపీ సురేష్ షెట్కార్ , ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ , టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
