మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి అడ్లూరి !

J.SURENDER KUMAR,

ధర్మపురి మండలం నేరేళ్ల గ్రామంలో వివిధ కారణాల రీత్యా మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను గురువారం రాత్రి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ  దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించి ఓదార్చారు.

ఇటీవల మృతి చెందిన  బొంతల కరుణాకర్  కుటుంబాన్ని పరామర్శించారు, అనంతరం ఆ కుటుంబానికి ₹ 20,000 ఆర్థిక సహాయం అందించారు. ఇదే గ్రామానికి చెందిన
పారిపెల్లి పూర్ణిమ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి  , ప్రభుత్వం, పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.