👉 80 మంది లబ్ధిదారులకు ₹ 2 5.56 లక్షల సీఎం సహాయనిధి!
👉 చెక్కులు పంపిణీ చేసిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
అనారోగ్యం, వైద్య చికిత్స తదితర కారణాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పత్రిక సహాయం అందించి ప్రభుత్వం అండగా ఉంటుందని, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
వెల్గటూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కుల పంపిణీ కార్యక్రమం గురువారం మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొని 80 మంది లబ్ధిదారులకు ₹ 25.56 లక్షల విలువైన CMRF చెక్కులను పంపిణీ చేశారు.
👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ……

ప్రజలకు అవసరమైన సమయంలో ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, పేద కుటుంబాల ఆర్థిక భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
