👉 రేపు నిధుల వినియోగంపై దేవాదాయ కమిషనర్ తో మంత్రి లక్ష్మణ్ కుమార్ సమీక్ష !
J SURENDER KUMAR,
వచ్చే సంవత్సరం జూలై మాసంలో జరగనున్న గోదావరి నది పుష్కరాల పనులలో భాగంగా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ ఉగ్ర నరసింహ స్వామి ఆలయ పునఃనిర్మాణంకు ₹ 10 కోట్ల రూపాయల నిధుల తో చేపట్టనున్న పనుల టెండర్ ప్రక్రియ, పూర్తయింది.
ఈ నేపథ్యంలో ఈ నెల 29 న ధర్మపురి ఆలయ ప్రాంగణంలో దేవాదాయ శాఖ కమిషనర్ , ఆ శాఖ ఇంజనీరింగ్ అధికారులు, వాస్తు, ఆగమశాస్త్ర పండితులు అర్చకులతో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
అర్చకుల, స్థానిక వేద పండితుల, భక్తుల మనోభావాలకు అనుగుణంగా, సనాతన ఆచార సాంప్రదాయాల, ఆచరణ, విధివిధానాలు అమలు అంశంపై సమీక్ష సమావేశంలో మంత్రి, కమిషనర్ భక్తుల, స్థానికుల సలహాలు, సూచనలు, అడిగి తెలుసుకోనున్నారు.
ఉగ్ర నరసింహ స్వామి ఆలయ పునఃనిర్మాణం పనులు సకాలంలో పూర్తి అవుతుందా ? తదితరు అంశాలను అర్చకులు, వేద పండితులు, భక్తుల నుండి బహిరంగంగా అభిప్రాయాలను సమీక్ష సమావేశంలో కోరనున్నారు. అర్చకుల, వేద పండితుల, భక్తుల అభిప్రాయాలు సలహాల సూచనల మేరకే, ప్రభుత్వం పనులు ప్రారంభించనున్నట్టు సమాచారం.
