TUWJ కార్యాలయాన్ని సందర్శించిన చండీగఢ్ ప్రెస్ క్లబ్ బృందం !

J SURENDER KUMAR,

భారతదేశంలో ప్రత్యేక గుర్తింపు గల చండీగఢ్ ప్రెస్ క్లబ్ ఆఫీస్ బేరర్ల బృందం సోమవారం బషీర్ బాగ్ లోని తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ( టీయూడబ్ల్యూజే) కార్యాలయాన్ని సందర్శించింది.

చండీగఢ్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దుగ్గల్ నేతృత్వంలోని జర్నలిస్టుల బృందం ఈ సందర్భంగా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్, ఐజేయు మాజీ అధ్యక్షుడుకే శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను శ్రీనివాస్ రెడ్డి వారికి వివరించారు.

👉 జర్నలిస్టుల వృత్తిపరమైన సమస్యల పరిష్కారం కోసం యూనియన్ చేస్తున్న కృషిని వివరించారు. హైదరాబాద్ కేంద్రంగా యూనియన్ కార్యకలాపాల పనితీరును వారికి వివరించారు. టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో చేపట్టిన పలు కార్యక్రమాల వివరాలను తెలుసుకొని చండీగఢ్ జర్నలిస్టుల బృందం ప్రశంసించింది.

👉వృత్తిపరంగా నిబద్ధత కలిగిన జర్నలిస్టుల సంక్షేమం కోసం చేస్తున్న కృషిని అభినందించింది. యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి వారి వెంట ఉన్నారు.