ఎల్లంపల్లి ప్రాజెక్టు నీరే నంది మేడారం చెరువులోకి !

👉 కాలేశ్వరం నీరు అంటూ టీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారు !

👉 ముఖ్యమంత్రి, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు !

J.SURENDER KUMAR,

ఎల్లంపల్లి ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతుందని ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటితోనే నంది మేడారం చెరువును నింపుతున్నారు అని ప్రజలను తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో టీఆర్ఎస్ నాయకులు అసత్య ఆరోపణలు, దుష్ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నంది మేడారం పంప్ హౌస్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,  రాష్ట్ర మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

👉 ఈ సందర్భంగా నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ…


నంది పంప్ హౌస్ ద్వారా నంది మేడారం చెరువును నింపుతున్న నీరు కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే సరఫరా అవుతోందని పేర్కొన్నారు. ఈ  వాస్తవాలను విస్మరించి, ఎల్లంపల్లి నీటిని కాలేశ్వరం నీరుగా పేర్కొంటూ టీఆర్ఎస్ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

👉 పిల్లర్లు కూలిపోయిన కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో అసత్య ప్రచారాలు చేయడం ప్రజలను మభ్యపెట్టడమేనని ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని కాలేశ్వరం నీరుగా ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి బిజెపి ఎంపీ ఈటల రాజేందర్,  మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, జీవన్ రెడ్డి తమ వ్యాఖ్యలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచిస్తూ, వారి విజ్ఞతకే ఈ విషయాన్ని వదిలేస్తున్నామని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.

👉 ప్రజలకు వాస్తవాలు తెలుసునని, అభివృద్ధి కార్యక్రమాలే కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేయడం మానుకుని ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకంగా స్పందించాలని టీఆర్ఎస్ నాయకులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.