బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి అడ్లూరి !


👉 ధర్మారం – గొల్లపల్లి మండలాలలో……

J.SURENDER KUMAR,

ధర్మపురి నియోజకవర్గం లోని ధర్మారం , గొల్లపల్లి మండలాలలో పనులు బాధిత కుటుంబాలను మంత్రి లక్ష్మణ్ కుమార్ గురువారం పరామర్శించి , అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

నంది మేడారం గ్రామానికి చెందిన మగ్గిడి తిరుపతి తండ్రి వెంకటయ్య ఇటీవల మరణించగా తిరుపతి కుటుంబాన్ని,
ఇదే గ్రామానికి చెందిన పులి సంధ్య ఇటీవల ఆనారోగ్యంతో మరణించగా సంధ్య భర్త ప్రవీణ్ తో పాటు కుటుంబాన్ని,


ఇదే గ్రామానికి చెందిన పుట్ట స్వామి ఇటీవల మరణించారు స్వామి కుటుంబాన్ని మంత్రి లక్ష్మణ్ కుమార్ పరామర్శించి ఓదార్చారు.
ఈ  గ్రామానికి చెందిన  రమేష్ కుమారుడు అయాష్స్ డెంగ్యు జరంతో ఆరోగ్యానికి గురి అయ్యాడు,

ఇదే గ్రామానికి చెందిన  వెలుతురు లచ్చయ్య కిడ్నీ సమస్యతో ఆపరేషన్ కాగా లచ్చయ్యను మంత్రి పరామర్శించి ఆరోగ్య సమస్యల గూర్చి తెలుసుకున్నారు.


మంత్రి వెంట ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రూప్లు నాయక్, నంది మేడారం సర్పంచ్ వీర్ పాల్ తో పాటు మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.


👉 గొల్లపల్లి మండలంలో..


మండలం లోని  మల్లన్న పేట గ్రామానికి చెందిన భీమ రాజమల్లు కుమారుడు భీమ రెడ్డి, ఇటీవల మరణించగా రాజమల్లు కుటుంబాన్ని, ఇదే గ్రామానికి చెందిన నస్పూర్ రాజన్న,  మృతిచెందగా రాజన్న కుమారుడు సాయితో పాటు వారి కుటుంబ సభ్యులను,

గుండా సురేష్,  మరణించగా సురేష్ అన్న గుండ రాజన్న తో పాటు వారి కుటుంబ సభ్యులను, భీమ రాజమల్లు, మరణించగా వారి కుటుంబ సభ్యులను మంత్రి లక్ష్మణ్ లక్ష్మణ్ కుమార్  పరామర్శించి ఓదార్చారు.

మల్లన్న పేట గ్రామానికి చెందిన మద్దెల గోవర్ధన్ ప్రమాదవశాత్తు  తీవ్ర గాయాలయ్యాయి, గోవర్ధన్ ను మండలం లో వెంగళపూర్ గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు వీరిని మంత్రి లక్ష్మణ్ కుమార్ పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.


👉 నూతన దంపతులను…..


మండలం లోలక్ష్మీపూర్ గ్రామానికి చెందిన సంగ్గెం తిరుపతి కుమార్తె అభినయశ్రీ వివాహము నితిన్ తో ఇటీవల జరగగా నూతన దంపతులకు మంత్రి  లక్ష్మణ్ కుమార్ న  శుభాకాంక్షలు తెలిపారు.


మంత్రి వెంట గొల్లపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాపల్లి గంగన్న, నిశాంత్ రెడ్డి, బుచ్చిరెడ్డి, గొల్లపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ భీమా సంతోష్, వైస్ చైర్మన్ రాజిరెడ్డి తో పాటు మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు
.