విశ్వకర్మ జయంతి ఉత్సవాల్లో మంత్రి అడ్లూరి..!
J.SURENDER KUMAR,
ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన విశ్వకర్మ జయంతి ఉత్సవాల్లో గురువారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ జయంతి ఉత్సవాల సందర్భంగా విశ్వకర్మలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం తరఫున విశ్వకర్మలకు అన్ని విధాల సహకరిస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ సందర్భంగా హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం ధర్మారం మండల అధ్యక్షుడు వెంకటేష్, ధర్మారం గ్రామ శాఖ అధ్యక్షులు శ్యాంసుందర్ తో పాటు ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రూప్ల నాయక్, మండలంలోని పలువురు సర్పంచులతో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
👉 పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి ….!

సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ రెండు వరకు నిర్వహించే స్వచ్ఛత ఈ సేవ పోస్టర్ ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం కరీంనగర్ కలెక్టరేట్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రతో పాటు కరీంనగర్ డీఆర్డీఓ గీతా తదితరులు పాల్గొన్నారు.
