బీఆర్ఎస్ తీరుపై మంత్రి లక్ష్మణ్ కుమార్ ఫైర్ !

👉 సభా మర్యాదలు మరిచి వ్యవహరిస్తారా ?

👉 స్పీకర్‌పై వ్యాఖ్యల వివాదంపై తీవ్ర ఆగ్రహం !

J.SURENDER KUMAR ,

తెలంగాణ శాసనసభ సమావేశాల్లో మంగళవారం రాజకీయ వేడి తారస్థాయికి చేరింది. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వ్యాఖ్యల అంశంపై జరిగిన చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

👉సభా గౌరవాన్ని కాపాడాల్సిందే..

స్పీకర్ పదవికి ఉన్న గౌరవాన్ని, శాసనసభ సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడాల్సిన బాధ్యత ఉందని మంత్రి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కు మొదటినుంచి దళిత వ్యతిరేకి అని, మీరు స్పీకర్ స్థానంలో కూర్చుంటే, సింగపూర్ నుండి అధ్యక్ష అనడానికి  ఇష్టపడడం లేదు అధ్యక్ష అని లక్ష్మణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్‌పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

👉 నాయకత్వం ఏం సందేశం ఇస్తోంది?

బీఆర్ఎస్ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి ప్రశ్నలు సంధించారు. పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు సభా మర్యాదలకు విరుద్ధంగా వ్యవహరిస్తే.. దానికి నాయకత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ విమర్శలకు హద్దులు ఉండాలని సూచించారు.

👉 వ్యక్తిగత విమర్శలకు సభ వేదిక కాదు!

ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడానికి ప్రతిపక్షానికి పూర్తి హక్కు ఉందని.. అయితే వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలకు అసెంబ్లీ వేదిక కాకూడదని మంత్రి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై చర్చించాల్సిన సభలో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు.

👉 తాతా మధు, నవీన్‌రెడ్డి వ్యవహారంపై చర్యలు!

స్పీకర్‌పై వ్యాఖ్యల వ్యవహారంలో ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్న అంశం అసెంబ్లీలో చర్చకు వచ్చింది. ఈ వ్యవహారంపై సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి శాసనమండలికి పంపడంతో వివాదం మరింత రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.