J. SURENDER KUMAR
శాసనసభ ఎదుట సోమవారం జరిగిన దురదృష్టకమైన పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి శాసనసభ స్పీకర్ ఛాంబర్‌లో శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ను పరామర్శించారు.
👉 శాసనసభ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు అసెంబ్లీ ఆవరణలో సభాపతి పట్ల అసభ్యకరమైన పదజాలంతో దూషించడమే కాకుండా అధికారులపై దాడులకు పాల్పడిన సభ్యుల ప్రవర్తన అనుచితంగా, తెలంగాణ సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించిన సంఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి స్పీకర్ ను ఓదార్చారు.
👉 అసెంబ్లీ ఎదుట జరిగిన దురదృష్టకర పరిణామాలపై పత్రికలు, అన్ని మీడియాలు ప్రముఖంగా ప్రచురించడమే కాకుండా టీవీల్లో ప్రసారం చేశాయి. స్పీకర్ ను వ్యక్తిగతంగా దూషించటంతో శాసనసభా వేదికగా వారు కంటతడి పెట్టుకున్న దృశ్యాలు చూసి ముఖ్యమంత్రి ఆవేదన చెందారు.
👉 మంగళవారం అసెంబ్లీకి రాగానే ముఖ్యమంత్రి నేరుగా స్పీకర్ గ ఛాంబర్‌కు వెళ్లి ఆయనను పరామర్శించారు. స్పీకర్ ని ఓదార్చి జరిగిన సంఘటనలపై విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, బాధ్యులపై తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటుందని స్పీకర్ కు తెలిపారు.
