👉 ప్రముఖ సంస్కృత విధ్వంసుడు డాక్టర్ కశోజ్జుల నీలకంఠ శర్మ చే….
J.SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో నేటి నుంచి భాగవత
సప్తాహంను ప్రముఖ సంస్కృత విధ్వంసుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయ సంస్కృత భాష రిటైర్డ్ హెడ్ డీన్
డాక్టర్ కశోజ్జుల నీలకంఠ శర్మ, ప్రవచనం చేయనున్నారు.
ధర్మప్రచారం లో భాగంగా భాద్రపద మాసంను పురస్కరించుకుని అనుబంధ దేవాలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం మరియు స్థానిక శారదా బ్రాహ్మణ మహిళామండలి ఆధ్వర్యంలో ఈ నెల 26 వరకు కొనసాగనున్నది.

ఈ సప్తాహ కార్యక్రమం లోక కళ్యాణార్థం సకలజన సంక్షేమార్థం భాగవత సప్తాహ నిర్వహిస్తున్నట్టు ఆలయ కార్య నిర్వహణ అధికారి శ్రీనివాస్ తెలిపారు.
