గణపతి హోమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు!


J.SURENDER KUMAR,


మంథని  పట్టణంలోని రావుల చెరువుకట్టలో హనుమాన్ ఆలయంలో ఏర్పాటు చేసిన వినాయక  విగ్రహం వద్ద ఆదివారం జరిగిన గణపతి హోమంలో  ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల  దుద్దిల్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు.


👉 ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ…


మా నియోజకవర్గ ప్రజలందరీకి, పెద్దపల్లి భూపాలపల్లి జిల్లా వాసులందరికీ మరియు రాష్ట్ర ప్రజలందరీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరూ సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని వారు కోరిన కోరికలు విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని వారు అనుకున్న పనులన్నీ సజావుగా జరిగేలా ఆ విగ్నేశ్వరుని ఆశీస్సులు అందరిపై ఉండాలని అందరూ బాగుండాలి అందులో మేముండాలి అని కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మంత్రి అన్నారు.

ప్రజా సంకల్పంతో ముందుకెళ్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం,  మన ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను తీసుకెళ్తూ ముందుకు నడిపిస్తున్నాం నేడు సంక్షేమంతో పాటు అభివృద్ధిని ఈ ప్రయత్న భాగంలోనే ఇటీవల ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క  సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి చాలా సంవత్సరాలుగా సింగరేణి ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకున్న వారందరికీ పట్టాలను నాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో రాజశేఖర్ రెడ్డి  చాలామందికి రేగులరైజేషన్ చేయడం జరిగింది మంత్రి శ్రీధర్ బాబు  అన్నారు.

  ప్రత్యేకంగా మన ప్రాంతం గోదావరిఖని, మంచిర్యాల్, మందమర్రి గాని అదేవిధంగా కొత్తగూడెం,  ఇల్లందు  ఇంకా మిగిలిపోయిన సింగరేణి స్థలాల సంబంధించి మరియు ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని వెంటనే వారికి  పట్టాలు పంపిణీ చేయాలని ఉపముఖ్యమంత్రి  బట్టి విక్రమార్క ఆదేశించారన్నారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలియజేస్తూ సింగరేణి కార్మికులకు,  గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి కార్యక్రమం ఎక్కడ అవాంతరాలు కలగకుండా పేదవాడి ఇల్లు పూర్తి స్థాయిలో పూర్తి చేసుకునే విధంగా సొంత ఇంటి కల నెరవేర్చుకునే సంకల్పంతో మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ కౌన్సిలర్స్ మండల కాంగ్రెస్ నాయకులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు