వినాయకులకు మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు !

J.SURENDER KUMAR,

ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ లోని బుగ్గారం, ధర్మపురి, మండల కేంద్రాలలో ఏర్పాటుచేసిన వినాయక మండపాల వద్ద  రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్  ఆదివారం వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

బుగ్గారం మండల కేంద్రంలో హిందూ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపం లో మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మపురి నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని వినాయకుడిని కోరినట్లు మంత్రి తెలిపారు.

మంత్రి వెంట జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందయ్య, బుగ్గారం సర్పంచ్ నక్క రాజవ్వ రాజయ్య, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బాదినేని రాజేందర్, ఉప సర్పంచ్ జంగ లావణ్య శ్రీనివాస్, బుగ్గారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

👉 శేఖల్ల గ్రామంలో…

మండలంలోని  శేకల గ్రామంలోని శ్రీ హనుమాన్ దేవాలయం లో రేకుల మండపాన్ని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. హనుమాన్ దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం రేకుల షెడ్డు నిర్మించడం అభినందనీయమని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. శేకల్ల గ్రామ అభివృద్ధికి తన వంతుగా సహకరిస్తానని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పర్శ రమేష్, ఆలయ కమిటీ చైర్మన్ ఠాగూర్ సుధీర్ సింగ్, ఆలయ కమిటీ వైస్ చైర్మన్ తన్నీరు హరీష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందయ్య, మాజీ జెడ్పిటిసి నేని రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

👉 తొట్లవాడ వినాయకుడికి ప్రత్యేక పూజలు !

ధర్మపురి పట్టణంలోని తొట్లవాడ పెద్ద బావి వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద వినాయకుడికి మంత్రి  ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తొట్లవాడ వినాయకుడి వద్ద ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మంత్రి వెంట ధర్మపురి మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.