J.SURENDER KUMAR,
గోదావరిఖని పట్టణంలో అనారోగ్యంతో మృతి చెందిన పలువురి కుటుంబాలను తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకుర్ తో కలిసి బుధవారం పరామర్శించారు.
ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులను మంత్రి ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు. మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితులను తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా కల్పించారు.

మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన మంత్రి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
