పోలీస్ అధికారులే టార్గెట్ గా మందు పాతర !

👉 మాటల్లో జీప్ రూటు మారింది టార్గెట్ మిస్ అయ్యారు !

👉 8 నెలలోనే చేదించిన జగిత్యాల పోలీసులు ! .

👉 నక్సలైట్ మరాఠి నరసయ్య ఇంటరాగేషన్ లో నిర్ధారణ !

J.SURENDER KUMAR,

వర్గ శత్రు నిర్మూలనకు పీపుల్స్ వార్ నక్సల్స్ మొట్టమొదటిసారి ఎంచుకున్న మందు పాతర పథకం  ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ లుగా ముద్రపడిన నాటి జగిత్యాల డిఎస్పి వేణుగోపాలకృష్ణ, సీఐ నర్సింగ్ రావులు  టార్గెట్ గా పేల్చారు, సంఘటన తర్వాత 8 నెలలకు పోలీసులు ఛేదించారు..

తమను హతమార్చడం కోసం  నక్సల్స్ శక్తివంతమైన మందు పాతరలు అమర్చి ఎంతో పగడ్బందీగా పథకం వేశారో,  ఈ పథకానికి కారకులైన వారితో సహా సంఘటనలో పాల్గొన్న నక్సల్స్ ను ఎట్టి పరిస్థితుల్లోను పట్టుకుని మందు పాతర వ్యూహం  చేదించాలని,  ఈ కేసును జగిత్యాల్ డివిజన్ పోలీసులు ఛాలెంజ్ గా  తీసుకున్నారు. ఆహోరాత్రులు గాలింపు చర్యలు చేపట్టి 8 నెలల వ్యవధిలోనే సంఘటనలో పాల్గొన్న ప్రముఖ నక్సలైట్ ను మరాఠీ నరసయ్యను పట్టుకొని వివరాలు సేకరించారు.

👉 విచారణ లో……

జగిత్యాల డిఎస్పి వేణుగోపాల్ కృష్ణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ నర్సింగరావులను అంతం చేసేందుకు  సారంగాపూర్ బీర్పూర్ మధ్యగల ఘాట్ రోడ్డు లో ” మెరుగు గుట్ట ”  వద్ద నక్సలైట్లు మూడు రోజులు మాఖం వేసి టార్చ్ లైట్ ల సహాయంతో ఏడు శక్తివంతమైన మందు పాతరలు అమర్చి వాటికి వైర్లు కలిపి 150 అడుగుల దూరంలో కొండలలో ముందు పాతర లు పేల్చడానికి స్విచ్ బోర్డు ( కంట్రోల్ రూమ్ లా) ఏర్పాటు చేసుకున్నారు.

👉 టార్గెట్  చేసి పోలీస్ అధికారులను రప్పించడానికి..

1989 ఆగస్టు 31 రాత్రి ఐదుగురు నక్సల్స్ బీర్పూర్ గ్రామానికి వెళ్లారు, గణపతి  సోదరుడు నర్సింగరావు స్వయాన మామ  మాజీ పట్వారి వంగపల్లి తిరుపతి రావు (66) ను ( నక్సల్స్ టార్గెట్ లో లేని వ్యక్తి) ఇంటి నుంచి రోడ్డుపైకి లాక్కొచ్చి   అతి దారుణంగా తల్వార్ తొ తలను నరికి ముండాన్ని వేరుచేసి హతమార్చి అదే రాత్రి తిరిగి మందు పాతరల వద్దకు చేరుకొని పోలీస్ అధికారుల కోసం మాటువేశారు. మూడు రోజులు ముందుగానే ఆయా గ్రామాల సర్పంచులతో కట్టెల కోసం, అడవుల్లోకి ప్రజలు వెళ్ళవద్దని ముందస్తుగా చాటింపు వేయించారు.

👉 సంఘటనలో పాల్గొన్నది….

పొన్నం రాయమల్లు, అంగె ఓదెలు, బోడగుంట సత్తయ్య, బాలయ్య, చిన్నక్క , దేవన్న , నారాయణ, బల్మూరి నారాయణరావు, బైరి రామచంద్రం,  అల్లే శంకర్, గణేష్ లాంటి దళ  నాయకులు సంఘటన స్థలంలో  పాల్గొన్నారు.

👉 సారంగాపూర్ ఎస్సై కానిస్టేబుల్ తో పాటుఅనేక వాహనాలను వదిలారు !

తిరుపతిరావు బంధువుల జీపు పేలడానికి ముందు అనేక వాహనాలు ఆ దారి లో ల్యాండ్ మైన్స్  మీదుగా వెళ్లాయి.  సారంగాపూర్ సబ్ ఇన్స్పెక్టర్, హమీద్,  ఆయన గన్ మాన్ మోటార్ సైకిల్ పై ఇదే దారి గుండా వెళుతుండగా మందు పాతర పేల్చడానికి వేచి ఉన్న నక్సలైట్ ఎస్సై ని, కానిస్టేబుల్ లేపేద్దాం,  అని సహచరులను కోరగా దళ నాయకుడు తిరస్కరించారు.

అక్కడే ఉన్న మరో నక్సలైట్ అంగె ఓదెలు  ‘ ఈ ఎస్ ఐ మా ఏరియా కు చెందిన వాడు ( సారంగాపూర్ ఎస్సై) అని దళ నాయకుడికి చెప్పాడు. దీనికి తోడు మందు పాతరల కోసం రోడ్డుపై గుంతలు తీస్తుండగా అంగె ఓదెలు  చేతికి బలమైన గాయం అయ్యింది.

👉 టార్గెట్ సిగ్నల్ రాంగ్….

పోలీసు వాహనం రాకను తెలిపే సిగ్నల్ కోసం స్విచ్ బోర్డు పైన ఓ చెట్టు కొమ్మకు గంట కట్టిన తాడును 550  అడుగుల దూరంలో రోడ్డు పక్కన చెట్ల పొదలలో చివర పట్టుకుని నక్సలైట్ గంట కొట్టేందుకు పన్నిన పథకం విఫలమై గంట మొగలేదు..

👉 గ్రీన్ కలర్ జీప్.. పోలీస్ జీప్ గా…

1985 రోజులలో పోలీసులు  గ్రీన్ కలర్ జీప్ ను వాడేవారు.. ఆ రోజులలో కిరాయి జీప్ యజమానులు, తమ జీప్ లకు గ్రీన్ కలర్ వేయించుకొనే వారు ( ఇందుకు కారణం సింగిల్  రోడ్డు పై ఎదురు గా వచ్చే, లారీలు, ఇతర వాహనాలు, దూరం నుంచి చూసి పోలీస్ జీప్ గా భావించి సైడ్ ఇవ్వడం కోసం అధిక శాతం కిరాయి జీప్ నిర్వాహకులు గ్రీన్  కలర్ వాడేవారు) జీప్ వేగంగా రావడం, గ్రీన్ కలర్. కిల్లింగ్ జోన్ పరిధి లోకి రాగానే మొదటి ల్యాండ్ మైన్ పేల్చారు. గాలిలోకి ఎగిరిన జీప్ లో వారు పోలీసులు కాదని గుర్తించిన వెంటనే మరో 6 మందు పాతర లు  పేల్చకుండా. అరే మీరా అంటూ కొందరు సాయుధ నక్సల్స్ అడవిలోకి పోయారు..

👉 సంచలనం కోసం తిరుపతిరావు హత్య..

పోలీస్ అధికారులను సంఘటనా స్థలానికి రప్పించడానికి నక్సల్స్  పక్కా స్కెచ్ వేశారు.  వంగపల్లి తిరుపతిరావు, వివాద రహితుడు, సౌమ్యుడు, వృద్ధుడు, నక్సల్స్ నుండి హెచ్చరికలు, బెదిరింపులు లేవు బీర్పూర్  గ్రామంలో అందరితో కలుపుగోలుగా ఉండేవాడు. మావోయిస్టు అధినేత గణపతి, సోదరుడికి స్వయంనా పిల్లనిచ్చిన మామ తిరుపతిరావును దారుణంగా హత్య చేస్తే టార్గెట్ డీఎస్పీ వేణుగోపాలకృష్ణ, సీఐ నర్సింగరావు లు సంఘటన స్థలానికి కచ్చితంగా తమ కిల్లింగ్ జోన్ గుండా వస్తారు అని నక్సల్స్ పకడ్బందీ పథకం పన్నారు.

👉 మాటలలో జీప్ రూటు మారింది.. టార్గెట్ మిస్సయింది..

బీర్పూర్ సంఘటన సమాచారం తో  డి.ఎస్.పి, సీ.ఐ జీప్ లో జగిత్యాల నుంచి బీర్పూర్  సంఘటన స్థలానికి బయలుదేరారు. జగిత్యాల ధర్మపురి రోడ్డులో తిప్పన్నపేట స్టేజి వద్ద  ” వై ” జంక్షన్ ఉంది ఎడమవైపు రోడ్డు గుండా పెంబట్ల కోనాపూర్ ,సారంగాపూర్ , ఘాట్ రోడ్డు గుండా  బీర్పూర్ కు వెళుతుంది. లేదా ధర్మపురి గుండా బీర్పూర్ కు చేరుకోవచ్చు..

సిఐ నరసింహారావు జీవు డ్రైవ్ చేస్తూ డీఎస్పీ తో సంఘటన తీరుపై  మాట్లాడుతూ డ్రైవ్ చేస్తుండగా వారు వై జంక్షన్ రోడ్డు దాటారు. తిరిగి వెనక్కి రావడం ఎందుకు అనుకొని ధర్మపురి గుండా బీర్పూర్ కు చేరుకోవడంతో నక్సల్స్  టార్గెట్ మిస్ అయింది.

👉 పోలీస్ అధికారులను నక్సల్స్ టార్గెట్ పథకం వెలుగు చూసింది ఇలా……

1990 లో. ప్రభుత్వం నక్సలైట్లకు ఇచ్చిన ఎనలేని స్వేచ్ఛ కాలంలో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా  జగిత్యాల ఏ ఎస్ పి తుషార్ ఆదిత్య త్రిపాఠి, చాకచక్యంగా ప్రముఖ నక్సలైట్ నాయకుడు మరాఠీ నరసయ్య ను లారీలు తనిఖీ చేస్తుండగా షార్ట్ వెపెన్ ( రివాల్వర్) తో 1990 మే మాసంలో పట్టుకున్నారు.

మందు పాతర సంఘటనలో ప్రత్యక్ష సంబంధం కలిగిన నక్సలైట్ కావడంతో, విచారణలో  మందు పాతర సంఘటనలో ఏ ప్రాంతం దళాలు, దళ నాయకులు పాల్గొన్నారో పోలీసులు ఊహించిన అవే పేర్లు విచారణలో వెలుగు చూశాయి.

నక్సలైట్ మరాఠీ నరసయ్యను,  గూడచారులను, స్నేహపూర్వకంగా ఇంటరాగేట్ చేసే తరహాలో  యాంటీ నక్సలైట్స్ స్క్వాడ్ కు చెందిన ప్రత్యేక పోలీస్ అధికారులు  రాష్ట్ర రాజధాని నుండి ప్రత్యేకంగా వచ్చారు.

మరాఠి నరసయ్యతో  కొన్ని రోజులుగా మాట్లాడుతూ వివరాలు సేకరించారు.  అనేక నిండు ప్రాణాలు పోవడానికి కారణమైన మందుపాతర సంఘటనతో ప్రత్యేక సంబంధం ఉన్న నక్సలైట్ మరాఠీ నరసయ్య ను విచారణ అనంతరం పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ లో కాల్చి చంపకుండా,  చట్టబద్ధంగా న్యాయస్థానానికి అప్పగించడంతో ముందుపాతర సంఘటన పథకం, టార్గెట్, తదితర వివరాలు  వెలుగు చూశాయి.